నెలాఖర్లో పెళ్లి

Niharika Happy Wedding Releases on July 28th - Sakshi

పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. వరుడు సుమంత్‌ అశ్విన్‌. వధువు నిహారిక. ఈ నెల 28న వీరి వివాహం జరగనుంది. ఇది రీల్‌ మ్యారేజ్‌. సుమంత్‌ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్‌’. యూవీ క్రియేషన్స్, పాకెట్‌ సినిమా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్‌ కానుంది. లక్ష్మణ్‌ కార్య మాట్లాడుతూ – ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట.

జీవించినంత కాలం ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి మనస్పర్థలు రాకుండా జీవించాలని అర్థం. దీనికి ఇరు పెద్దలు కూర్చుని చక్కటి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. పెళ్లికి ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చూపించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్, రీ రికార్డింగ్‌: తమన్, కెమెరా: బాల్‌ రెడ్డి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top