'హలో' అంటున్న మరో భామ..! | Sakshi
Sakshi News home page

'హలో' అంటున్న మరో భామ..!

Published Wed, Sep 13 2017 2:02 PM

Newbie Nivedhithaa Sathish in Akhil Hello

అఖిల్ సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నటవారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుందట.

ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న మగలిర్ మట్టుమ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నివేదితా సతీష్, అఖిల్ హాలోలో మరో హీరోయిన్ గా నటిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నివేదిత షూటింగ్ లో కూడా పాల్గొంటుందన్న టాక్ వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement