ఫీల్‌ గుడ్‌  లవ్‌ స్టోరీ  | new movie dubbing in telugu | Sakshi
Sakshi News home page

ఫీల్‌ గుడ్‌  లవ్‌ స్టోరీ 

Feb 21 2018 12:58 AM | Updated on Feb 21 2018 12:58 AM

new movie dubbing in telugu - Sakshi

కేజీ, అతుల్య

కేజీ, అతుల్య జంటగా శివరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాదల్‌ కన్‌ కట్టుదే’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని ‘ప్రేమ పావురాలు’ పేరుతో నిర్మాత శ్రీరామ్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘మా శ్రీరామ్‌ సినిమా బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం  ‘వాసుకి’. ఆ సినిమా తర్వాత వస్తోన్న రెండో చిత్రం ‘ప్రేమ పావురాలు’. ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తెలుగులో ఈ సినిమా రీమేక్‌ చేయాలనుకున్నాం. ఒరిజినల్‌ అంత ఫ్రెష్‌గా ఔట్‌పుట్‌ రాదని డబ్‌ చేస్తున్నాం. శివరాజ్‌  కథ, కథనాలతో పాటు లీడ్‌ యాక్టర్స్‌ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పవన్‌ సంగీతం, ఆర్‌.ఆర్‌. సినిమాకి హైలెట్‌. స్ట్రయిట్‌ తెలుగు సినిమా తరహాలో క్వాలిటీగా డబ్బింగ్‌ వర్క్‌  జరుగుతోంది. ఈ సినిమాని వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement