లండన్లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్ | New bond movie specter world Premier in london | Sakshi
Sakshi News home page

లండన్లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్

Oct 27 2015 3:00 PM | Updated on Sep 3 2017 11:34 AM

లండన్లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్

లండన్లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్

అంతర్జాతీయ సినీ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బాండ్ మూవీ స్పెక్టర్ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో నెలలుగా బిజీ షెడ్యూల్ షూట్స్ తో, గాయాలతో, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా...

అంతర్జాతీయ సినీ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న  బాండ్ మూవీ స్పెక్టర్ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో నెలలుగా బిజీ షెడ్యూల్ షూట్స్ తో, గాయాలతో, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపిన చిత్రయూనిట్ ఫైనల్ గా తన కష్టాన్ని వెండితెర మీద చూపించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రీమియర్ కు హాలీవుడ్ తారలు తరలి వచ్చారు.

లండన్ లోని రాయల్ అల్బర్ట్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ప్రీమియర్ లో బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్ క్రెగ్ తో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న లీ సెడాక్స్, మోనికా బెలుస్సీలు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రిన్స్ హారీ ఈ ప్రీమియర్ షోకు ప్రధాన ఆకర్షణ గా నిలిచారు. ప్రీమియర్ షోకు హాజరైన సెలబ్రిటీ అభిమానులతో పాటు సహనటులతో సెల్ఫీలు దిగుతూ సందడిగా కనిపించారు.

డానియల్ క్రెగ్ నాలుగో సారి బాండ్ గా నటిస్తున్న స్పెక్టర్ నవంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. బాండ్ సీరీస్ లో 24వ సినిమాగా రిలీజ్ అవుతున్న స్పెక్టర్ ఈ సీరీస్ లో ఆఖరి చిత్రం అన్న ప్రచారం కూడా జరగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా స్పెటర్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సీరీస్ లో రిలీజ్ అయిన గత రెండు చిత్రాలు ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవటంతో యూనిట్ సభ్యులకు స్పెక్టర్ సక్సెస్ కీలకం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement