టాలెంట్‌కు వయసుతో సంబంధమేముంది : నీనా గుప్తా

Neena Gupta: Older women can also be sexy - Sakshi

టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదనే మాటకు బాలీవుడ్‌ నటి నీనా గుప్త (62) ఆదర్శంగా నిలిచారు. ఆరుపదుల వయసులో గతేడాది విడుదలై ఘనవిజయం సాధించిన ముల్క్‌, బధాయి హో చిత్రాల్లో నటించిన నీనాను ఎన్నో అవార్డులు వరించాయి. చిత్ర పరిశ్రమలో యుక్త వయసు తర్వాత మహిళలకు సినిమా అవకాశాలు రావడంలేదన్న అంశంపై ఆమె స్పందింస్తూ... ‘సీనియర్‌ నటీమణులకు హీరోయిన్‌గా అవకాశాలు రావటం కష్టం. కథానాయికగా చేయనంత మాత్రాన వారు అందంగా లేరని కాదు. వారిని కొన్ని పాత్రలకే పరిమితం చేయటం సరైంది కాదు. ఈ విషయంలో బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు.

‘నటుడు ఆయుష్మాన్‌ (ఖురాన్‌) సలహా మేరకు స్ర్కిప్ట్‌ పూర్తిగా చదవటం అలవాటు చేసుకున్నాను. ప్రస్తుతం ఓ హారర్‌ స్ర్కిప్ట్‌ ఉంది. అన్ని జోనర్లతో పాటు కమర్షియల్‌ చిత్రాల్లోనూ నటించాలనుంది. కళాత్మక సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించకతే  సంతృప్తినివ్వవు. కానీ, బధాయి హో కమర్షియల్‌గా కూడా విజయం  సాధించటం చాలా సంతోషాన్నిచ్చింది’ అని నీనా గుప్తా చెప్పారు. ఇక జానే భీ దో యారో, బధాయి హో వంటి చిత్రాలు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘సినిమాల్లో నా రీ ఎంట్రీని ప్రోత్సహించింది నా కూతురు మసబ గుప్తా. ఇప్పుడు నా విజయాలపట్ల ఆమె ఆనందిస్తోంది. నా జీవితంలో ఈ ఆనందకరమైన మార్పుకు తనే కారణం’ అని నీనా తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top