డైనమిక్ పాత్రలో నయన | Nayanthara plays an aspiring cop in Raja-Ravi project | Sakshi
Sakshi News home page

డైనమిక్ పాత్రలో నయన

Dec 30 2013 4:50 AM | Updated on Sep 2 2017 2:05 AM

డైనమిక్ పాత్రలో నయన

డైనమిక్ పాత్రలో నయన

మంచి డైనమిక్ పాత్రలో నటించాలని కథానాయకులు కోరుకోవడం సర్వసాధారణం. మరి అలాంటి పాత్రలు హీరోయిన్లను వరిస్తే ఆ పాత్రలతోపాటు ఈ

మంచి డైనమిక్ పాత్రలో నటించాలని కథానాయకులు కోరుకోవడం సర్వసాధారణం. మరి అలాంటి పాత్రలు హీరోయిన్లను వరిస్తే ఆ పాత్రలతోపాటు ఈ నటీమణులకు క్రేజ్ లభిస్తుంది. నటి అనుష్క అరుంధతి చిత్రంలో అలాంటి పెరోషియస్ పాత్రతోనే అత్యంత ప్రాచుర్యం పొందారన్నది తెలిసిందే. తాజాగా క్రేజీ నటి నయనతార ఒక డైనమిక్ పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. జయం రాజా దర్శకత్వంలో ఆయన తమ్ముడు జయం రవి హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. 
 
ఆమె ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించనున్నారట. ఇప్పటి వరకు తెరపై అందాలను మాత్రమే ఆరబోసిన ఈ బ్యూటీ తెలుగు చిత్రం శ్రీరామరాజ్యంలో పవిత్రమూర్తి సీతగా జీవించారు. తాజాగా పవర్‌ఫుల్ పాత్రలో పోలీస్ అధికారిగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార ఫైట్స్ కూడా చేయనున్నారట. దీని గురించి దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ తన చిత్రాల్లో హీరోతోపాటు హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో నయనతారకు సూటబుల్ అయ్యే పాత్రను కొత్తగా డిజైన్ చేశామన్నారు. యాక్షన్‌తో కూడిన ఈ పాత్రకు ఆమె న్యాయం చేయగలరని పేర్కొన్నారు. ప్రస్తుతం నయన ఈ పాత్ర కోసం ఫైట్స్‌లో శిక్షణ పొందుతున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement