నయనతార జైలు జీవితం! | Nayanthara in Nanbenda Movie | Sakshi
Sakshi News home page

నయనతార జైలు జీవితం!

Mar 2 2016 10:49 PM | Updated on Sep 3 2017 6:51 PM

నయనతార జైలు జీవితం!

నయనతార జైలు జీవితం!

హీరోయిన్ నయనతార జైలు జీవితం గడపడమేంటి? ఆమె అంత నేరం ఏం చేశారని కంగారు పడుతున్నారా!

హీరోయిన్ నయనతార జైలు జీవితం గడపడమేంటి? ఆమె అంత నేరం ఏం చేశారని కంగారు పడుతున్నారా!. ఆ కంగారు కాస్త పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఆమె జైలు జీవితం గడిపింది రియల్ లైఫ్‌లో కాదులెండి! రీల్ లైఫ్‌లో మాత్రమే! ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా ఏ. జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నన్‌బేన్డా’ (నీ ఫ్రెండ్‌నే అని అర్థం) తమిళంలో మంచి విజయం అందుకుంది.
 
 ఆ చిత్రాన్ని ‘గుడ్ ఈవెనింగ్’ పేరుతో భద్రకాళీ ఫిలిమ్స్ అధినేత ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘అష్టకష్టాలు పడి హీరోయిన్  ప్రేమను దక్కించుకుంటాడు హీరో. తాను పదిరోజుల పాటు జైలు జీవితాన్ని గడిపానని తన ఫ్లాష్‌బ్యాక్‌ను హీరోకు చెబుతుంది ఆమె.
 
 ఆ ఫ్లాష్‌బ్యాక్ లోని భయంకరమైన నిజాలేంటి? చివరకు ఏమైంది? అన్నదే చిత్ర కథాంశం. ఈ నెలలోనే పాటలు, సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. సంతానం, కరుణాకరన్, శాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్, కెమేరా: బాల సుబ్రమణ్యం, సహ నిర్మాతలు: ఏ.వెంకట్రావ్, సత్యశీతల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement