breaking news
life in prison
-
ప్రజ్వల్‌కు జీవితఖైదు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌కు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్‌పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు. పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్‌హౌస్‌లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్‌ను అరెస్ట్చేయడం తెల్సిందే. కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యారి్థని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి. బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్ïÙట్ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. బాధితురాలికి హ్యాట్సాఫ్: సీఐడీ చీఫ్ వ్యాఖ్య బనశంకరి: ఈ కేసులో ఎన్ని బెదిరింపులు ఎదురైనా బాధితురాలు ధైర్యంగా ఎదుర్కొన్నారని సీఐడీ అదనపు డీజీపీ బిజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘కేసు నమోదైన 16 నెలల్లో తీర్పు రావడం నిజంగా ప్రత్యేకం. లైంగిక వేధింపుల వీడియోలో ఉన్నది ప్రజ్వల్ అని కోర్టుకు నిరూపించడానికి సిట్ ఎంతో శ్రమించింది. నేర నిరూపణకు బాధితురాలి ధైర్యమే కారణం. ఆమెకు ఈ విషయంలో సీఐడీ నిజంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ఈమె నిరుపేద కావడంతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాబల్యం కలిగిన వ్యక్తి కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు’’అని బిజయ్ అన్నారు. ఎప్పుడేం జరిగిందంటే? → 2024 ఏప్రిల్ 22: ప్రజ్వల్ రేప్ వీడియోలు వైరల్ → ఏప్రిల్ 25 : అశ్లీల వీడియోలపై దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి లేఖ → ఏప్రిల్ 26–27: జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ → ఏప్రిల్ 28 : ప్రజ్వల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు → ఏప్రిల్ 28 : అశ్లీల దృశ్యాలు కలిగిన పెన్‌డ్రైవ్ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం → ఏప్రిల్ 30: జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్‌ను సస్పెండ్ చేస్తూ జేడీఎస్ నిర్ణయం → మే 1 : ప్రజ్వల్‌పై అత్యాచారం కేసు నమోదు → మే 30: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ప్రజ్వల్ అరెస్టు → సెప్టెంబర్ 9 : 113 సాక్షులతో కూడిన 1,632 పేజీల రెండో చార్జ్ïÙట్ దాఖలు → నవంబర్ 11 : ప్రజ్వల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు → 2025 జూలై 18 : విచారణ పూర్తి చేసి జూలై 30న తీర్పు వెలువరిస్తామని చెప్పిన కోర్టు → జూలై 30: ఆగస్టు 1కి తీర్పు వాయిదా → ఆగస్టు 1: ప్రజ్వల్‌ను దోషిగా తేలి్చన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం → ఆగస్టు 2: ప్రజ్వల్‌కు జీవిత ఖైదు విధింపు -
సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు
లక్నో: సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ప్రజాపతితోపాటు మరో ఇద్దరు ఆశిష్ శుక్లా, అశోక్ తివారీకి శుక్రవారం జీవిత ఖైదు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల జరిమానాను విధించింది. ఈ కేసులో నిందితులైన వికాశ్ వర్మ, రూపేశ్వర్, అమరేంద్ర సింగ్ అలియాస్ పింటూ, చంద్రపాల్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. కాగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రవాణా, మైనింగ్ శాఖల మంత్రిగా ప్రజాపతి పని చేశారు. కాగా మాజీ మంత్రి, అతని ఆరుగురు అనుచరులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ 2017 ఫిబ్రవరి 18న యూపీలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తాను పని కోసం లక్నోలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లినప్పుడు వీరంతా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక తన కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. అయితే పోలీసులు తన కేసులో నిర్లక్ష్యం వహించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై గౌతంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం 2017 మార్చి 15న మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు. -
నయనతార జైలు జీవితం!
హీరోయిన్ నయనతార జైలు జీవితం గడపడమేంటి? ఆమె అంత నేరం ఏం చేశారని కంగారు పడుతున్నారా!. ఆ కంగారు కాస్త పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఆమె జైలు జీవితం గడిపింది రియల్ లైఫ్‌లో కాదులెండి! రీల్ లైఫ్‌లో మాత్రమే! ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా ఏ. జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నన్బేన్డా’ (నీ ఫ్రెండ్‌నే అని అర్థం) తమిళంలో మంచి విజయం అందుకుంది. ఆ చిత్రాన్ని ‘గుడ్ ఈవెనింగ్’ పేరుతో భద్రకాళీ ఫిలిమ్స్ అధినేత ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘అష్టకష్టాలు పడి హీరోయిన్ ప్రేమను దక్కించుకుంటాడు హీరో. తాను పదిరోజుల పాటు జైలు జీవితాన్ని గడిపానని తన ఫ్లాష్‌బ్యాక్‌ను హీరోకు చెబుతుంది ఆమె. ఆ ఫ్లాష్‌బ్యాక్ లోని భయంకరమైన నిజాలేంటి? చివరకు ఏమైంది? అన్నదే చిత్ర కథాంశం. ఈ నెలలోనే పాటలు, సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. సంతానం, కరుణాకరన్, శాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్, కెమేరా: బాల సుబ్రమణ్యం, సహ నిర్మాతలు: ఏ.వెంకట్రావ్, సత్యశీతల. -
వెండితెరకు సల్మాన్ జైలు జీవితం!
కండలవీరుడు సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులో జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీ నం. 210గా ఆయన శిక్ష అనుభవించారు. ఈ శిక్ష ఆధారంగా రంజిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఖైదీ నం.210’ చిత్రం ముంబయ్‌లో ఆరంభమైంది. సల్మాన్‌ని పోలినట్లుగా ఉండే ఉస్మాన్ ఖాన్ని టైటిల్ రోల్‌కి తీసుకున్నారు. సల్మాన్‌తో పాటు అప్పట్లో జైలులో ఉన్న మహేశ్ సైనీ అనే వ్యక్తి ఇందులో తన నిజజీవిత పాత్రను చేస్తున్నారు. సల్మాన్ జింకలను వేటాడిన సమయంలో ఆయన వాహనాన్ని నడిపిన డ్రైవర్ హరీష్ ధులానీని డ్రైవర్ పాత్రకు ఎంపిక చేశారు. ఆ వాహనాన్నే ఈ చిత్రంలో వాడనున్నారు. ఇది జీవిత చరిత్ర కాదు కాబట్టి ఎవరి దగ్గరా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదనీ, సల్మాన్‌ని చెడ్డవాడిగా చూపించే చిత్రం కాదనీ దర్శకుడు తెలిపారు. కాగా, ఈ కేసుకి సంబంధించిన తుది తీర్పు ఈ నెల 25న వెలువడనుంది. ఆ తీర్పుతో ఈ చిత్రం ముగుస్తుందని ఊహించవచ్చు. -
క్రూర నేరంగా ‘యాసిడ్ దాడి’
న్యూఢిల్లీ: మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిపోతుండటంతో ఈ కేసులను క్రూరమైన కేసుల కిందకు తీసుకురావడానికి కేంద్రం కసరత్తుచేస్తోంది. ఈ కేసుల విచారణకు నిర్దిష్ట సమయాన్ని విధించి, బాధితులకు త్వరితగతిన న్యాయాన్ని అందించాలని యోచిస్తోంది. క్రూరమైన కేసుల కేటగిరీ కిందకు తెస్తే యాసిడ్ దాడులకూ గరిష్టంగా యావజ్జీవ కారాగారం లేదా మరణదండన విధించే అవకాశముంటుందని హోం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నేర న్యాయచట్టం (సవరణ)-2013 ప్రకారం యాసిడ్ దాడి కేసులో దోషిగా రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవం పడుతుంది. ఈ కేసుల విచారణను 60 రోజుల్లోగా పూర్తిచేయాలి. యాసిడ్ దాడుల నియంత్రణకు చట్టపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారని అందులో పేర్కొన్నారు.