లుక్‌ అదిరింది; జంటగా చూడాలని ఉంది! | Nayanthara In Greece Vacation With Vignesh Shivan | Sakshi
Sakshi News home page

వైరల్‌గా నయన్‌ ఫొటో..నెటిజన్లు ఫిదా!

Jun 11 2019 8:31 PM | Updated on Jun 11 2019 8:34 PM

Nayanthara In Greece Vacation With Vignesh Shivan - Sakshi

తీరికలేకుండా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నా.. కాస్త టైం దొరకగానే వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తూంటారు కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విఘ్నేష్‌ శివన్, నయనతార. నటిగా నయనతార, కథా రచయిత, డైరెక్టర్‌గా విఘ్నేష్‌ తమ తమ రంగాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే పనికి మాత్రమే పరిమితం కాకుండా.. ఏ కొంచెం విరామం దొరికినా సరే విదేశాలకు వెళ్లడం వీరిద్దరికి అలవాటు. తాజాగా ఈ రొమాంటిక్‌ కపుల్‌ గ్రీసులోని ఏథెన్స్‌లో విహరిస్తున్నారు.

ఈ సందర్భంగా సాంటోరినీలో నయనతార దిగిన ఫొటోలను విఘ్నేష్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఫెయిరీ లుక్‌లో నయన్‌, ఆమె వెనుక అద్దంలో విఘ్నేష్‌ ప్రతిబింబంలతో కూడిన ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో.. ‘ లేడీ సూపర్‌స్టార్‌ లుక్‌ అదిరిపోయింది. మీ ఇద్దరినీ జంటగా చూడాలని ఉంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా కలిసి హాలిడే ట్రిప్పులకు వెళ్లడం, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్న ఈ జంట.. తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. ఈ విషయం గురించి చెప్పినా చెప్పకపోయినా సరే.. కనీసం పెళ్లి ఎప్పుడో చెప్పండి అంటూ తమిళ ప్రేక్షకులు స్టార్‌ కపుల్‌ని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం నయనతార..రజనీకాంత్‌ సినిమా దర్బార్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement