జత కుదిరే | Nani romance with Reba Monica John for the movie JERSEY | Sakshi
Sakshi News home page

జత కుదిరే

Oct 13 2018 5:44 AM | Updated on Oct 13 2018 5:45 AM

Nani romance with Reba Monica John for the movie JERSEY - Sakshi

రెబ్బా మోనికాజాన్‌, నాని

నెక్ట్స్‌ సినిమా కోసం నాని ‘జెర్సీ’ వేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు జతగా నటించే భామ ఎవరో తెలిసింది. ‘మళ్లీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా ‘జెర్సీ’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాని క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఆయన పాత్ర మూడు దశల్లో ఉండబోతోందట.

ఈ సినిమాలో నానికి జోడీగా మలయాళ నటి రెబ్బా మోనికా జాన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. నివీన్‌ పౌలీ ‘జాకోబింటే స్వర్గరాజ్యం’అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు రెబ్బా మోనిక. మలయాళం, తమిళంతో కలిపి నాలుగు సినిమాల్లో నటించిన మోనిక ‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగులో పరిచయం కానున్నారు. ఈ నెల 18న ముహూర్తం జరుపుకుని చివరి వారంలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రానికి అనిరు«ద్‌ సంగీతం అందించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement