బిగ్‌ బాస్‌ 2 టీజర్ : ఏదైనా జరగొచ్చు | Nani Bigg Boss Telugu 2 Teaser | Sakshi
Sakshi News home page

Jun 2 2018 11:59 AM | Updated on Jul 18 2019 1:45 PM

Nani Bigg Boss Telugu 2 Teaser - Sakshi

బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌ను యంగ్ హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి  తెలిసిందే. ఇప్పటికే నానికి సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. తొలి సీజన్‌ను ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరో హోస్ట్ చేయటంతో భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పుడు నాని ఆ రేంజ్‌ కంటిన్యూ చేయగలడా.. లేదా..? అన్నది చూడాలి. రెండో సీజన్‌కు మరింత మసాలా యాడ్‌ చేస్తున్నట్టుగా నాని ఇప్పటికే హింట్ ఇచ్చాడు.

తాజాగా షో కాన్పెప్ట్‌ను వివరిస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. అక్వేరియంలో వివిధ రకాల చేపలను చూపిస్తూ రూపొందించిన ఈ టీజర్‌కు నాని వాయిస్ అంధించారు. బిగ్‌ బాస్‌ 2లో 16 మంది కంటెస్టెంట్‌లు పాల్గొంటుండగా ఈ సీజన్‌ 100 రోజుల పాటు కొనసాగనుంది. జూన్‌ 10 బిగ్‌ బాస్‌ 2 ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement