నాగ్ టైటిల్తో నాగచైతన్య..? | Sakshi
Sakshi News home page

నాగ్ టైటిల్తో నాగచైతన్య..?

Published Sat, Jan 7 2017 10:47 AM

నాగ్ టైటిల్తో నాగచైతన్య..? - Sakshi

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల సక్సెస్తో మంచి ఊపు మీదున్న నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా లాంటి బిగ్ హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణ.. నాగచైతన్య కోసం నిన్నేపెళ్లాడతా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమాకు నాగార్జున హీరోగా తెరకెక్కిన అల్లరి అల్లుడు టైటిల్ను తీసుకోవాలని భావిస్తున్నారట. 90లలో ఘనవిజయం సాధించిన ఈ టైటిల్ చైతన్య సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, నాగ్ కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో ఒక్కటిగా నిలిచిన హలోబ్రదర్ సినిమాలోని ప్రియరాగాలే పాటను రిమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి  ఈ టైటిల్పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వకాపోయినా.. అక్కినేని అభిమానులు మాత్రం నాగ్ టైటిల్కే ఓటేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement