ఫస్ట్‌ మేమేనండీ...

Nagarjuna, Nani multi starrer being shot in Metro - Sakshi

...అంటున్నారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. అవును..మెట్రో ట్రైన్‌ను  ప్రారంభించిన తర్వాత షూటింగ్‌ జరుపుకున్న ఫస్ట్‌ టీమ్‌ వీళ్లదే. నాగార్జున, నాని కాంబినేషన్‌లో శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా షూటింగ్‌ చేస్తున్నారు.

సినిమాలో ట్రైన్‌ సీన్స్‌ కొన్ని ఉన్నాయట. ఆ సన్నివేశాలను మెట్రో ట్రైన్‌లో షూట్‌ చేశారు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు సినిమా మాదే అని ఆనందంగా తెలిపింది చిత్రబృందం. హీరో నాని, హీరోయిన్‌ రష్మిక మండన్నలతో పాటు నటుడు సంపూర్ణేష్‌ బాబు పాల్గొన్న సన్నివేశాలను ట్రైన్‌లో చిత్రీకరించారు. ట్రైన్‌లో తీసిన సీన్స్‌తో ఫస్ట్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో నాగార్జున మాజీ డాన్‌ పాత్రలో, నాని డాక్టర్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని సమాచారమ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top