ధనుష్ దర్శకత్వంలో నాగార్జున | Nagarjuna To Act In Dhanush Direction | Sakshi
Sakshi News home page

May 30 2018 4:20 PM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna To Act In Dhanush Direction - Sakshi

కింగ్ నాగార్జున ఈ శుక్రవారం ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చాలా కాలం తరువాత రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నటించిన నాగ్, ఈ సినిమా వర్మ తిరిగి ఫాంలోకి వచ్చేస్తాడని గట్టిగా చెపుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు నాగ్‌. ఆఫీసర్‌ తరువాత శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నానితో కలిసి మల్టీస్టారర్‌ సినిమాను నాగ్‌ పూర్తిచేయాల్సి ఉంది.

ఆ తరువాత నాగ్‌ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. ఆఫీసర్‌ ప్రమోషన్‌లో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడిన నాగ్‌, కోలీవుడ్‌ హీరో ధనుష్‌ తో సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయని వెల్లడించారు. ధనుష్‌, రజనీకాంత్ కోసం ఓ కథ తయారు చేశారని, అయితే రజనీ రాజకీయాల్లో బిజీ కావటంతో అదే కథను నాగ్‌ తో తెరకెక్కించాలని భావిస్తున్నారట. అయితే ఈ సినిమా చేస్తున్నట్టుగా నాగ్‌ కన్ఫామ్‌ చేయలేదు.

అంతేకాదు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ కథ విన్నానని చెప్పిన నాగార్జున ఆ సినిమా చేసే అవకాశముందంటూ హింట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ మరో హీరోగా నటించే అవకాశం ఉంది. వీటితోపాటు బంగార్రాజు సినిమా పనులు కూడా జరుగుతున్నాయని చెప్పిన వర్మ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement