నగరం నాకు రిలీఫ్‌ ఇచ్చింది | Nagaram movie release today | Sakshi
Sakshi News home page

నగరం నాకు రిలీఫ్‌ ఇచ్చింది

Mar 9 2017 11:13 PM | Updated on Sep 15 2019 12:38 PM

నగరం నాకు రిలీఫ్‌ ఇచ్చింది - Sakshi

నగరం నాకు రిలీఫ్‌ ఇచ్చింది

‘నగరం’ కథ విన్నప్పుడే, ఆ కాన్సెప్ట్‌కి కనెక్ట్‌ అయిపోయా.

‘నగరం’ కథ విన్నప్పుడే, ఆ కాన్సెప్ట్‌కి కనెక్ట్‌ అయిపోయా. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. సందీప్‌ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్‌ ముఖ్య పాత్రల్లో లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నగరం’ ఈరోజు విడుదలవుతోంది.

సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ – ‘‘ప్రతి మనిషిలో మంచీ, చెడూ ఉంటాయి.. వారిలోని మంచితనం కరెక్ట్‌ టైమ్‌కి బయటపడితే బాగుంటుంది’ అన్నదే ‘నగరం’ కథ. ఈ యూనిట్‌ అంతా కొత్తవారే. సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఉద్యోగాలు వదులుకుని మరీ తీశారు. ఒక మంచి డైరెక్టర్‌ నా చిత్రం ద్వారా పరిచయమవుతున్నందుకు గర్వంగా ఉంది. నా గత చిత్రాలు ‘రన్, ఒక్క అమ్మాయి తప్ప’ సరిగ్గా ఆడలేదు. దాంతో నాపై నాకే డౌట్‌ వేసింది. నేను సరైన కథలను ఎంచుకుంటున్నానా? అని. ‘నగరం’ ప్రివ్యూ చూసిన తెలుగు, తమిళ పరిశ్రమ పెద్దలు ‘చాలా బాగుంది’ అని అభినందిస్తుంటే రిలీఫ్‌ అనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement