అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2 | MSG - 2 on October 1 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2

Sep 30 2015 2:36 AM | Updated on Sep 3 2017 10:11 AM

అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2

అక్టోబర్ 1న ఎంఎస్‌జీ-2

ఎంఎస్‌జీ (మెసెంజర్ ఆఫ్ గాడ్) గత ఏడాది వివాదాలకు గురై సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం ఇది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా

ఎంఎస్‌జీ (మెసెంజర్ ఆఫ్ గాడ్) గత ఏడాది వివాదాలకు గురై సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం ఇది. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి గుర్మీత్ హీరో, దర్శకుడు. ఈయన పూర్తి పేరు సెయింట్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీ ఇసాన్ జీతూ ఆరోరా ఇసాన్. ఇకపోతే సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న కాలం ఇది. గుర్మీత్ ఎంఎస్‌జీ-2 పేరుతో సీక్వెల్ చిత్రం చేశారు. ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు మాత్రమే కాకుండా సంగీతం, ఎడిటింగ్ అంటూ అదనపు బాధ్యతల్ని కూడా తన భుజస్కంధాలపైనే మోశారు.

హకీకట్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎంఎస్‌జీ చిత్రం కంటే గ్రాఫిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు బ్రహ్మాండంగా ఉంటాయంటున్నారు చిత్ర యూనిట్. ఈ నెల 18న హిందీలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఎంఎస్‌జీ-2 చిత్రాన్ని అక్టోబర్1న తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement