రజనీ జీవితంపై సినిమా | Movie on rajani s movie | Sakshi
Sakshi News home page

రజనీ జీవితంపై సినిమా

May 28 2014 11:45 PM | Updated on Sep 12 2019 10:40 AM

రజనీ జీవితంపై సినిమా - Sakshi

రజనీ జీవితంపై సినిమా

సూపర్‌స్టార్ రజనీకాంత్ నిజ జీవితం పలు ఆసక్తికర, అనూహ్య సంఘటనల మయం.

సూపర్‌స్టార్ రజనీకాంత్ నిజ జీవితం పలు ఆసక్తికర, అనూహ్య సంఘటనల మయం. ఆయన జీవితంలో కొంత భాగం అంటే యుక్త వయసులో స్నేహమయ జీవితం వెండితెర కెక్కనుంది. ఇందులో రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు రాజ్ బహుదూర్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. నటుడు కాక ముందు రజనీకాంత్ బస్ కండక్టర్‌గా పని చేశారన్న విషయం తెలిసిందే. అదే బస్సులో డ్రైవర్‌గా పని చేసిన రాజ్ బహుదూర్ రజనీలో నటనాసక్తిని చూసి ఆయన్ని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించడానికి సాయం చేశారు. రజనీ సూపర్‌స్టార్ అయిన తర్వాత కూడా రాజ్ బహుదూర్‌తో స్నేహం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఆ స్నేహమే ప్రస్తుతం సినిమాగా రూపొందనుంది.

ఒరువళి శాలై పేరుతో తమిళం, కన్నడం భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రుషి దర్శకత్వం వహించనున్నారు. దీని గురించి రజనీకాంత్ చిరకాల మిత్రుడు రాజ్‌బహుదూర్ మాట్లాడుతూ ఈ చిత్రం రజనీతో తనకు గల స్నేహమే ఇతివృత్తంగా రూపొందనున్నట్లు తెలిపారు. రజనీ, తాను నాటకాల్లో కలిసి నటించామని గుర్తు చేశారు. అప్పుడు తమ మధ్య స్నేహం ఎలా మొగ్గ తొడిగింది, అది నేటికీ ఏ మాత్రం తగ్గకుండా ఎలా కొనసాగుతోంది అనేది ఆవిష్కరించే చిత్రం ఇదన్నారు. ఈ చిత్రంలో రజనీగా ఎవరు నటించనున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు.  స్నేహం గొప్పతనాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ చిత్ర రూపకల్పన గురించి రజనీకి చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని అదే విధంగా చిత్రం పూర్తి అయిన తరువాత కలిసి చూద్దాం అని అన్నారని రాజ్ బహుదూర్ తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement