మోహన్ బాబుకు టికెట్ దొరకలేదట | Mohan Babu On Eedorakam Aadorakam Movie | Sakshi
Sakshi News home page

మోహన్ బాబుకు టికెట్ దొరకలేదట

Apr 16 2016 9:52 AM | Updated on Sep 3 2017 10:04 PM

మోహన్ బాబుకు టికెట్ దొరకలేదట

మోహన్ బాబుకు టికెట్ దొరకలేదట

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక హోదా సొంతం చేసుకున్న మంచు మోహన్ బాబుకు సినిమా టికెట్ దొరకలేదట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించారు. తన తనయుడు...

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక హోదా సొంతం చేసుకున్న మంచు మోహన్ బాబుకు సినిమా టికెట్ దొరకలేదట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించారు. తన తనయుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన 'ఈడోరకం ఆడో రకం' సినిమాను అభిమానులతో కలిసి థియేటర్ లో చూడాలని ప్లాన్ చేసుకున్నారు మోహన్ బాబు. అయితే తాను అనుకున్న సమయానికి టికెట్లు దొరకపోవటంతో ఈ బాధ ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
 
మోహన్ బాబు శుక్రవారమే సినిమా చూడాలనుకున్నా టికెట్లు దొరకపోవటంతో నిర్మాత అనీల్ సుంకరను అడిగి శనివారానికి టికెట్లు తెప్పించుకున్నారట. కానీ ఆరోజు కూడా తాను అడిగినన్ని టికెట్లు దొరకలేదని చెప్పారు. మంచు విష్ణుతో పాటు రాజ్ తరుణ్ మరో హీరోగా తెరకెక్కిన ఈడో రకం ఆడో రకం సినిమాకు జి నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవటంతో పాటు అదే స్థాయిలో కలెక్షన్లు కూడా వసూళ్లు చేస్తోంది.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement