ఓ చిన్న తప్పు!

Meeku Mathrame Chepta gets release date - Sakshi

హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. తరుణ్‌ భాస్కర్, అభినవ్‌ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్‌ ప్రధాన పాత్రల్లో షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 1న విడుదల కానుంది. నిర్మాతల్లో ఒకరైన వర్థన్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మంచోడు అనే ఇమేజ్‌ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండింది? అనేది సినిమా. యూత్‌కి కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అనురాగ్‌ పర్వతనేని.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top