మాయదారి మల్లిగాడితో రొమాన్స్ | Mayadari malligadi romance | Sakshi
Sakshi News home page

మాయదారి మల్లిగాడితో రొమాన్స్

Oct 24 2013 1:17 AM | Updated on Sep 1 2017 11:54 PM

‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో నటించి తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూర్ణ, సుధీర్‌బాబుకి జోడీగా చేయబోతున్నారు.

‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో నటించి తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూర్ణ, సుధీర్‌బాబుకి జోడీగా చేయబోతున్నారు. ‘మాయదారి మల్లిగాడు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 28న మొదలు కానుంది. హనుమ ముప్పరాజు దర్శకత్వంలో యం.రేవన్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ కలబోతతో పూర్తిస్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు, పూర్ణల రొమాన్స్ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రతన్, కెమెరా: బీఎల్ సంజయ్.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement