సూర్య మాస్ పోస్టర్ ఇంగ్లీషుకు కాపీనా? | masss suriyaa mid night movie fiest | Sakshi
Sakshi News home page

సూర్య మాస్ పోస్టర్ ఇంగ్లీషుకు కాపీనా?

Oct 22 2014 10:47 AM | Updated on Sep 2 2017 3:15 PM

సూర్య మాస్ పోస్టర్ ఇంగ్లీషుకు కాపీనా?

సూర్య మాస్ పోస్టర్ ఇంగ్లీషుకు కాపీనా?

ప్రయోగాలకు పెద్దపీట వేసే హీరో సూర్య.. తన 'మాస్' చిత్రం పోస్టర్ను దీపావళి కానుకగా మంగళవారం అర్ధరాత్రి విడుదల చేశాడు.

ప్రయోగాలకు పెద్దపీట వేసే హీరో సూర్య.. తన 'మాస్' చిత్రం పోస్టర్ను దీపావళి కానుకగా మంగళవారం అర్ధరాత్రి విడుదల చేశాడు. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్లో నల్లటి బొగ్గు రంగు పూసుకుని ఉన్న సూర్య చాలా విభిన్నంగా కనిపించాడు. బహుముఖ ప్రజ్ఞావంతుడైన వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ మాత్రం.. వేరే ఇంగ్లీషు సినిమా పోస్టర్కు కాపీ అన్న అనుమానాలు వస్తున్నాయి. 'ద బోర్న్ అల్టిమేటం' అనే ఇంగ్లీషు సినిమా పోస్టర్ కూడా అచ్చం ఇలాగే ఉంది. అందులో హీరో కూడా ఇలా నల్లరంగు పూసుకుని పోస్టర్లో కనిపిస్తాడు. 'మాస్' ఫేస్బుక్ పేజీలో సూర్య పోస్టర్ పోస్ట్ చేయగానే.. కొంతమంది ఈ రెండు సినిమాల పోస్టర్లను పక్కపక్కనే పెట్టి.. ఇది కాపీ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇంతకుముందు కమలహాసన్ నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం పోస్టర్ మీద కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది. అయితే అది వేరే సినిమాకు మాత్రం కాపీ కాదు. ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ మాత్రం ఇంగ్లీషు సినిమా పోస్టర్కు అచ్చుగుద్దినట్లుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను స్టూడియో గ్రీన్తో కలిసి వెంకట్ ప్రభు నిర్మిస్తున్నారు. నయనతార, అమీ జాక్సన్ ఈ సినిమాలో సూర్య సరసన నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement