నీతోని కష్టమే కృష్ణవేణి!

Mass Song Released From Orey Bujjiga Telugu Film - Sakshi

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్ ‘నీతోని కష్టమే కృష్ణవేణి’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించాడు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ మాస్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన కృష్ణవేణి పాటను బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ కృష్ణవేణి ఓ కృష్ణవేణి నీతోని కష్టమే కృష్ణవేణి, కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి’ పాట యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇక ఈ సినిమా నుంచి ‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున’ అనే పాట ఇదివరకే విడుదలైన సంగతి తెలిసిందే.
(చదవండి: ఒరేయ్‌ బుజ్జిగా.. ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌)

(చదవండి: ఈ సినిమా టైటిల్‌ బాగా పాపులర్‌ అయింది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top