మరాఠీ నటి నయనతార కన్నుమూత | Marathi actress Nayana Tara passes away | Sakshi
Sakshi News home page

మరాఠీ నటి నయనతార కన్నుమూత

Dec 1 2014 10:57 PM | Updated on Sep 2 2017 5:28 PM

అలనాటి మరాఠీ సినీ నటి నయనతార (64) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.

ముంబై: అలనాటి మరాఠీ సినీ నటి నయనతార(64) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆమె ఠాణలో నివాసముంటున్నారు. కొంత కాలంగా మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం ఆస్వస్థతకు గురికావడంతో ఆమెను ముంబైలోని నాయర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించిన నయనతార 'బాళా గావు కషి అంగాయి', 'అశి హీ బన్వా బన్వీ', 'ధాంగడ్‌ధింగా' తదితర ప్రముఖ మరాఠీ చిత్రాలలో ఆమె నటించారు.
**

Advertisement
 
Advertisement
Advertisement