
మనోజ్ నెక్స్ట్ సినిమా ఏదో తెలుసా?
శరవేగంగా సినిమాలు పూర్తిచేస్తూ ఒకదాని తర్వాత మరో ప్రాజెక్టును వెంటవెంటనే ఓకే చేస్తున్న మంచుమనోజ్ తాజాగా చేస్తున్న సినిమా గురించిన విశేషాలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
శరవేగంగా సినిమాలు పూర్తిచేస్తూ ఒకదాని తర్వాత మరో ప్రాజెక్టును వెంటవెంటనే ఓకే చేస్తున్న మంచుమనోజ్ తాజాగా చేస్తున్న సినిమా గురించిన విశేషాలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రతో మనోజ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
'ఒక్కడు మిగిలాడు' అనే టైటిల్‌తో అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మనోజ్ ఒక ఉద్యమకారుడి పాత్రను పోషిస్తున్నట్లు సినిమా ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో తాను చాలా బరువైన, ఎమోషనల్ పాత్రను పోషిస్తున్నట్లు మనోజ్ వెల్లడించాడు. మనోజ్ సరసన రెజీనా చేస్తున్న ఈ సినిమాలో ఇంకా.. అజయ్, జెన్నీ, అల్లు రమేష్, భారతీరావు, ప్రేమిక తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వీకే రామరాజు, సంగీతం: శివ ఆర్. నందిగం, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, కాస్ట్యూమ్స్: నీరజా కోన, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, నిర్మాతలు: ఎస్ఎన్ ఎడ్డి, లక్ష్మీకాంత్. అచ్చిబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇది కాక.. 'నా రాకుమారుడు' ఫేమ్ ఎస్.కె.సత్య దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఈ సొట్టబుగ్గల చిన్నోడు అంగీకరించాడు. రాజేంద్రప్రసాద్, సంపత్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు.
My new film 'Okkadu Migiladu' directed by Ajay Andrews. Playing an intense & emotional character.. pic.twitter.com/XFPB7KXl6D
— Manchu Manoj (@HeroManoj1) 3 August 2016