అంజలి కోసమే.. | Mammootty to star in Ram's Tamil movie Peranbu with Anjali | Sakshi
Sakshi News home page

అంజలి కోసమే..

Aug 23 2017 2:51 AM | Updated on Sep 17 2017 5:51 PM

అంజలి కోసమే..

అంజలి కోసమే..

లాంగ్‌రన్‌ హీరోయిన్లలో నటి అంజలి ఒకరు. అదే విధంగా లక్కీ నటి, బహుభాషా నటి కూడా. తెలుగు, తమిళం, మలయాళం అంటూ పలు భాషల్లో రాణిస్తున్నారు.

 లాంగ్‌రన్‌ హీరోయిన్లలో నటి అంజలి ఒకరు. అదే విధంగా లక్కీ నటి, బహుభాషా నటి కూడా. తెలుగు, తమిళం, మలయాళం అంటూ పలు భాషల్లో రాణిస్తున్నారు. ఒక భాషలో చిత్రాలు లేవనుకునేలోపే మరో భాషలో బీజీగా నటించడంతో అంజలికి మర్కెట్‌ పడిపోయిందని ఎవరైనా అనుకుంటే అది వారి అపోహనే అవుతుంది. పుష్కరంలోకి అడుగుపెట్టిన ఈ ఆరణాల తెలుగు ఆడపడుచు నేటికీ మంచి ప్రాచుర్యం కలిగిన కథానాయకిగానే కొనసాగుతున్నారు. అదేవిధంగా తన కోసమే దర్శకులు కథలు రాసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.

 ఇటీవలే తెరపైకి వచ్చిన తరమణి చిత్రంలో గెస్ట్‌గా మెరిసిన అంజలి ఆ చిత్రంలో ఎట్రాక్షన్‌గా మారారని చెప్పవచ్చు. ఈ చిత్ర దర్శకుడు రామ్‌నే అంజలికి తమిళంలో నాయకిగా పరిచయం చేశారు. తొలుత 2005లో ‘ఫొటో’ అనే తెలుగు చిత్రం ద్వారా నాయకిగా రంగప్రవేశం చేసిన అంజలి కోలీవుడ్‌లో 2006 ‘కట్రదు తమిళ్‌’ చిత్రంతో రంగప్రవేశం చేశారు. దర్శకుడు రామ్‌ మాట్లాడుతూ కట్రదు తమిళ్‌ చిత్రం ద్వారా తాను పరిచయం చేసిన నటి అంజలి అని, తొలిచిత్రంలోనే పరిణితి చెందిన నటనను ఆమె అభినయించారని అన్నారు.

నటి ఆండ్రియా కథానాయకిగా నటించిన తరమణి చిత్రంలో వ్యాపారపరంగా ప్లస్‌ అవుతారని అంజలిని అతిథి పాత్రల్లో నటింపజేయాలని భావించానన్నారు. తనను అడగగానే మరో ఆలోచన లేకుండా నటించడానికి ఓకే చెప్పారని తెలిపారు. ప్రస్తుతం మమ్ముట్టి కథానాయకుడిగా తాను దర్శకత్వం వహిస్తున్న పేరంబు చిత్రంలో అంజలినే కథానాయకిగా నటిస్తున్నారని చెప్పారు. తదుపరి చిత్రానికి అంజలిని దృష్టిలో పెట్టుకునే కథను తయారు చేస్తున్నానని దర్శకుడు రామ్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement