మొత్తానికి మహేష్‌కు టిక్కెట్లు దొరికేశాయ్‌! | Mahesh Babu Watched Avengers Endgame In AMB | Sakshi
Sakshi News home page

మొత్తానికి మహేష్‌కు టిక్కెట్లు దొరికేశాయ్‌!

May 6 2019 8:55 AM | Updated on May 6 2019 8:55 AM

Mahesh Babu Watched Avengers Endgame In AMB - Sakshi

‘మహర్షి’తో బిజీగా ఉన్న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం రిలాక్స్‌ అయినట్టున్నారు. ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న మహేష్‌.. ఆదివారం సాయంత్రం ఏఎమ్‌బీలో ప్రత్యక్షమయ్యారు. మహర్షి ప్రమోషన్స్‌లో భాగంగా.. అవేంజర్స్‌ చిత్రాన్ని వీక్షించారా అన్న ప్రశ్నకు మహేష్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చి అందర్నీ నవ్వించారు.

ఏఎంబీలో తాను టిక్కెట్లు అడిగితే.. హౌస్‌ఫుల్‌ అయ్యాయని టిక్కెట్లు దొరకడం లేదని మహేష్‌ అన్నారు. మొత్తానికి ఆదివారం సాయంత్రం ఏఎమ్‌బీలో ‘అవేంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ను వీక్షించినట్లు మహేష్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఏఎమ్‌బీలో మొదటి చిత్రం అంటూ.. సినిమా బాగా నచ్చిందని.. ఏఎమ్‌బీ ఎక్స్‌పీరియన్స్‌ బాగుందని.. ఏఎమ్‌బీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement