మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు | Mahesh Babu Emotional Tweet On Chandrayaan 2 Project | Sakshi
Sakshi News home page

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

Sep 7 2019 7:01 PM | Updated on Sep 7 2019 7:03 PM

Mahesh Babu Emotional Tweet On Chandrayaan 2 Project - Sakshi

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో యావత్‌ భారతదేశం ఇస్రోకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇస్రోకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భాసటగా నిలిచారు.

ఈ క్రమంలో మహేష్‌ బాబు కామెంట్‌ చేస్తూ.. ఇస్రోకు అభినందనలు తెలిపాడు. మహర్షి సినిమాలోని డైలాగ్‌ను కోట్‌ చేస్తూ.. సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఏ డెస్టినీ.. ఇట్స్‌ ఏ జర్నీ అంటూ ఇస్రోకు మద్దతు తెలిపాడు. చంద్రయాన్‌-2 కోసం పని చేసిన ప్రతీ ఒక్క శాస్త్రవేత్తకు సెల్యూట్‌ చేస్తున్నట్తు తెలిపాడు. మీరే మా నిజమైన హీరోలు.. మేము మీ వెంటే ఉంటాము.. మీ విజయగాథకు ఇది కేవలం ఆరంభమే అంటూ ట్వీట్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement