ముచ్చటగా మూడు | maganti srinath new movie | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడు

Apr 3 2017 12:09 AM | Updated on Sep 5 2017 7:46 AM

ముచ్చటగా మూడు

ముచ్చటగా మూడు

లవ్, రొమాన్స్, థ్రిల్‌... ముఖ్యాంశాలుగా రాజాశ్రీ దర్శకత్వంలో మిసిమి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘సమయం’తో హీరోగా పరిచయమవు

లవ్, రొమాన్స్, థ్రిల్‌... ముఖ్యాంశాలుగా రాజాశ్రీ దర్శకత్వంలో మిసిమి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘సమయం’తో హీరోగా పరిచయమవు తున్నారు మాగంటి శ్రీనాథ్‌. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘సమయం’ విడుదలకు ముందే మరో రెండు సినిమాల్లో హీరోగా శ్రీనాథ్‌కు అవకాశాలు వచ్చాయి.

శ్రీనాథ్‌ మాట్లాడుతూ – ‘‘వరుసగా మూడు సినిమాల్లో ఛాన్స్‌ రావడం హ్యాపీ. నగేష్‌ మాకం దర్శకత్వంలో ఎం.ఎస్‌. క్రియేషన్స్‌ మహంకాళి శ్రీనివాస్‌ నిర్మించే సినిమా, రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ప్రొడక్షన్స్‌ ఎస్‌. సరిత నిర్మించే మరో సినిమా అంగీకరించా. మూడు సినిమాలతో నటుడిగా నా ప్రతిభను నిరూపించుకుని, మంచి పేరు తెచ్చుకుంటా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement