మాధురి.. ఓ మంచి నిర్మాత! | Madhuri Dixit turns producer with Marathi film | Sakshi
Sakshi News home page

మాధురి.. ఓ మంచి నిర్మాత!

Aug 31 2017 2:02 AM | Updated on Sep 17 2017 6:09 PM

మాధురి.. ఓ మంచి నిర్మాత!

మాధురి.. ఓ మంచి నిర్మాత!

బాలీవుడ్‌ బ్యూటీలు ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ కేవలం నటనపైనే దృష్టి పెట్టడం లేదు.

బాలీవుడ్‌ బ్యూటీలు ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ కేవలం నటనపైనే దృష్టి పెట్టడం లేదు. నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌ కూడా చేరారు. ఆర్‌.ఎన్‌.ఎం. మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ని ఆరంభించారు. స్వప్ననీల్‌ జయకర్‌ దర్శకత్వంలో త్వరలో ఓ మరాఠీ చిత్రాన్ని ఆమె నిర్మించనున్నారు. ‘‘సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. యోగేశ్‌ వినాయక్‌ జోషి ఈ సినిమాకి మంచి కథ అందించారు. మంచి టీమ్‌తో ఈ సినిమా నిర్మించబోతున్నాం. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా మంచి నటి అనిపించుకున్నా. ఈ సినిమాతో మంచి నిర్మాత అని కూడా అనిపించు కుంటా’’ అని మాధురి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement