చిన్న వయసులో విగతజీవిగా మారిన నటుడు | Marathi Actor Tushar Ghadigaonkar Passed Away At Age Of 34 Under Suspicious Circumstances | Sakshi
Sakshi News home page

Actor: అవకాశాల్లేక మద్యానికి బానిస.. చిన్న వయసులోనే ప్రాణం తీసుకున్న నటుడు!

Jun 22 2025 10:23 AM | Updated on Jun 22 2025 11:45 AM

Marathi actor Tushar Ghadigaonkar Passed Away at 34

మరాఠీ నటుడు తుషార్‌ ఘడిగోయెంకర్‌ (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై గోరెగావ్‌లోని అద్దెకుంటున్న ఫ్లాట్‌లో శుక్రవారం విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల నివేదిక ప్రకారం.. శుక్రవారం రోజు.. రామ్‌ మందిర్‌ రోడ్‌లో ఓ ఫ్లాట్‌లోని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌కాల్‌ వచ్చింది. 

అపస్మారక స్థితిలో?
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా తుషార్‌ నేలపై స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రంగుల ప్రపంచంలో రాణించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తుషార్‌కు పెద్దగా అవకాశాలు దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏడాది కాలంగా మద్యానికి బానిసయ్యాడని పోలీసులు చెప్తున్నారు. 

సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నటుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా తుషార్‌.. మరాఠీ సినిమాల్లోనే కాకుండా థియేటర్‌ ఆర్టిస్టుగానూ రాణించారు. ఘంట నాద్‌ ప్రొడక్షన్‌ పేరిట సొంతంగా ఓ మ్యూజిక్‌ వీడియో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆయన.. ఇలా చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

చదవండి: ప్రభాస్‌ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement