స్త్రీగా మారిన పురుషుడి అంతరంగ వేదన | Linda Thompson on her relationships with Bruce Jenner | Sakshi
Sakshi News home page

స్త్రీగా మారిన పురుషుడి అంతరంగ వేదన

Apr 28 2015 11:45 PM | Updated on Sep 3 2017 1:02 AM

స్త్రీగా మారిన పురుషుడి  అంతరంగ వేదన

స్త్రీగా మారిన పురుషుడి అంతరంగ వేదన

ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడిగా పేరు తెచ్చుకొని, ఆనక సినిమాల్లో, అటుపైన రియాలిటీ టీవీ షోలలో ప్రసిద్ధ తార

ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడిగా పేరు తెచ్చుకొని, ఆనక సినిమాల్లో, అటుపైన రియాలిటీ టీవీ షోలలో ప్రసిద్ధ తార అయిన అమెరికన్ - బ్రూస్ జెన్నర్. ఇన్నాళ్ళూ పురుషుడిగా జీవిస్తున్నప్పటికీ తన అంతరాంతరాళాల్లో స్త్రీత్వ భావనే గూడుకట్టుకొని ఉందని ఆ మధ్య ప్రకటించి, సంచలనం రేపారు బ్రూస్. ఇప్పుడు తన ఈ లైంగిక పరిణామ క్రమాన్ని ఎనిమిది భాగాల రియాలిటీ షోగా అందిస్తున్నారాయన.
 
 ఈ టీవీ సిరీస్‌లో బ్రూస్ తన చిన్నప్పటి మనోభావాల మొదలు, పెళ్ళయి, పిల్లలు కూడా పుట్టాక తన లైంగిక పరిణామ క్రమం వల్ల భార్యాపిల్లలతో అనుబంధాల్లో వచ్చిన మార్పుల దాకా అన్నీ మనసు విప్పిచెప్పనున్నారు. టీవీలో చూపించనున్నారు.
 
  పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ, మనిషి అంతరంగ వేదనకు అద్దం పట్టే ఈ కీలకమైన అంశాలను కుండబద్దలు కొట్టినట్లుగా బ్రూస్ చెప్పాలనుకుంటున్నారు. ఒక వ్యక్తి ధైర్యంగా చెబుతున్న ఈ లైంగిక పరిణామక్రమ కథనాన్ని యథాతథంగా చూపించాలని టీవీలు ఉత్సాహపడుతున్నాయి. ఈ విభిన్నమైన టీవీ సిరీస్ ఎన్ని సంచలనాలు రేపుతుందో వేచి చూడాలి.
 

Advertisement

పోల్

Advertisement