పేరు తిరగబడింది | Lakshmi Rai is now Raai Laxmi | Sakshi
Sakshi News home page

పేరు తిరగబడింది

Jun 3 2014 10:46 PM | Updated on Sep 2 2017 8:16 AM

పేరు తిరగబడింది

పేరు తిరగబడింది

‘కాంచనమాల కేబుల్ టీవీ, అధినాయకుడు, కాంచన’ తదితర చిత్రాల్లో నటించిన అందాల తార లక్ష్మీ రాయ్ గుర్తుంది కదూ! తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నా

 ‘కాంచనమాల కేబుల్ టీవీ, అధినాయకుడు, కాంచన’ తదితర చిత్రాల్లో నటించిన అందాల తార లక్ష్మీ రాయ్ గుర్తుంది కదూ! తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నా ఆమెకు ఎందుకనో గుర్తింపు రావడం లేదు. ఈ విషయంలో ఆమెకు బోలెడంత అసంతృప్తి కూడా ఉంది. అదృష్టం తిరగబడాలంటే ఒకటే మార్గం అనుకుందో ఏమో తన పేరును ముందు వెనుకకు మార్చుకున్నారు. లక్ష్మీ రాయ్ కాస్తా... ‘రాయ్ లక్ష్మీ’ అయ్యిందన్న మాట. ఇలా పేరు మార్చుకోమని ఆమె నాన్నగారు ఏడాది కాలంగా చెబుతున్నా పట్టింపుకోలేదట. చివరకు ‘నాన్న మాట బంగారు బాట’ అనుకుని పేరు మార్పుకు పచ్చజెండా ఊపేశారు. ఇక నుంచి ఆమెను ‘రాయ్ లక్ష్మీ’ అని పిలవాలి. అయితే పేరు తిరగబడినంత ఈజీగా అదృష్టమూ తిరగబడుతుందో లేదో వేచి చూడాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement