అంతకు మించి..! | Sakshi
Sakshi News home page

అంతకు మించి..!

Published Fri, Dec 2 2016 11:37 PM

అంతకు మించి..!

బికినీలందు అసలు సిసలైన బికినీ వేరయా అంటున్నారు రాయ్ లక్ష్మి. తెరపై బికినీలో కనిపించాలంటే అందాల తారలకు బోలెడన్ని గట్స్ కావాలనేది తరచూ సినీ జనాలు చెప్పే మాట! అటువంటి గట్స్ రాయ్ లక్ష్మిలో ఉన్నాయనే చెప్పుకోవాలి. సినిమాలు, స్పెషల్ సాంగులు, క్యాలెండర్‌లకు పోజులు.. పలుమార్లు రాయ్ లక్ష్మి బికినీ తరహా దుస్తుల్లో కనిపించారు. అవన్నీ ఓ ఎత్తు.. ఇప్పుడు హిందీలో హీరోయిన్‌గా పరిచయం అవుతోన్న ‘జూలీ-2’లో బికినీ మరో ఎత్తు అట! ఎందుకంటే.. అవన్నీ పక్కా బికినీ సన్నివేశాలు కావట! ‘బికినీ సన్నివేశాల్లో నటించడం మీకు కష్టంగా అనిపించిందా?’ అని రాయ్ లక్ష్మిని అడిగితే.. ‘‘నేనిప్పటి వరకూ పక్కా బికినీ సీన్లు చేయలేదు. ‘జూలీ-2’లో మాత్రం చేయవలసి వచ్చింది.

దాన్నో సవాలుగా స్వీకరించి చేశా. ఎంతైనా హీరోయిన్లకు బికినీ సీన్లు చేయడం ఛాలెంజింగే’’ అన్నారామె. అంటే.. ఈ హాట్ బ్యూటీ ‘జూలీ-2’తో ప్రేక్షకులను కనువిందు చేయడం పక్కా అన్న మాట. హిందీ సంగతులు పక్కన పెడితే... చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’లో రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ చేశారు. మెగాస్టార్‌తో చిందేయడం గురించి మాట్లాడుతూ - ‘‘ఎప్పుడో ఒకప్పుడు చిరంజీవి వంటి లెజెండ్ పక్కన డ్యాన్స్ చేస్తానని ఊహల్లో కూడా అనుకోలేదు. నా కల నిజమైంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement