కూతురి తొలి ఫొటోతో చిల్డ్రన్స్‌ డే విషెస్‌ చెప్పిన హీరో! | Kunal Kemmu wishes Happy Children’s Day by posting his daughter | Sakshi
Sakshi News home page

Nov 14 2017 6:59 PM | Updated on Nov 14 2017 6:59 PM

Kunal Kemmu wishes Happy Children’s Day by posting his daughter  - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. ఆ అమాయకమైన బాల్యాన్ని తలుచుకుంటే, ఆ అమాయకమైన చిన్నారుల్ని చూస్తే... వేల కట్టలేని సంతోషం మన సొంతమవుతోంది. ఈ రోజు బాలల దినోత్సతం. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటుడు కునాల్‌ ఖేము తన గారాలపట్టిని సోషల్‌ మీడియాకు పరిచయం చేశాడు. ఇటీవల జన్మించిన తన కూతురి తొలి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ బాలల దినోత్సవం కునాల్‌ ఖేము, సోహా అలిఖాన్‌ దంపతులకు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ దంపతులు గత సెప్టెంబర్‌ 29న తొలి బిడ్డకు జన్మనిచ్చారు.

దైవికమైన చూపులతో చూడగానే ఎంతో ముద్దొచ్చేలా ఉన్న తన కూతురు ఇనాయా నౌమి ఫొటోను కునాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘ప్రపంచంలోని చిన్నారులందరికీ, నా మంచ్‌కిన్‌కి బాలల దినోత్సవం శుభాకాంక్షలు. మేం మంచి మనుష్యులుగా ఎదిగేలా మీ అమాయకత్వం మాలో స్ఫూర్తి నింపుతూనే ఉండని..’ అంటూ కామెంట్‌ పెట్టాడు. కులాన్‌, సోహా అలీఖాన్‌ 2015లో పెళ్లి చేసుకున్నారు. కునాల్‌ ఇటీవల నటించిన ’గోల్‌మాల్‌ అగైన్‌’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement