చిరు తరువాత విజయ్‌ దేవరకొండతో..! | Koratala Siva Next Films With Chiranjeevi And Vijay Deverakonda | Sakshi
Sakshi News home page

Oct 30 2018 10:14 AM | Updated on Oct 30 2018 10:59 AM

Koratala Siva Next Films With Chiranjeevi And Vijay Deverakonda - Sakshi

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవితో తెరకెక్కించనున్నారు. భరత్‌ అనే నేను తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న కొరటాల, చిరంజీవి కోసం ఇంట్రస్టింగ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశాడట. ఈ సినిమా తరువాత కొరటాల శివ ఓ క్రేజీ స్టార్‌తో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇటీవల ఓ ఫంక్షన్‌లో విజయ్‌ దేవరకొండ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించారు కొరటాల. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు కూడా ఫైనల్‌ కానుందన్న టాక్‌ వినిపిస్తోంది. చిరుతో సినిమా పూర్తయిన వెంటనే విజయ్‌ దేవరకొండ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే ఛాన్స్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా రిలీజ్‌కు రెడీ అవుతుండగా డియర్‌ కామ్రేడ్‌ చిత్రీకరణ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement