కోలీవుడ్ గాయకుడిగా ప్రవాస తమిళన్

కోలీవుడ్ గాయకుడిగా ప్రవాస తమిళన్


సినిమాకు ఎల్లలు లేనట్టుగా నే గాయకుడికీ భాషాభేదం ఉం డదు. తెలుగు, మలయాళం, ఉత్తరాదికి చెందిన అనేక మంది గాయకులు తమిళ చిత్రాల్లో పాడుతూ ప్రాచుర్యం పొదుతున్నారు. ఇప్పు డీ కోవలోకి అమెరికాలో నివసిసు ్తన్న ప్రవాస తమిళుడు నారాయణన్‌మోహన్ చేరారు. ఆయన ఇప్పటి కే అయ్యనార్ వీధి, తోండియాన్ చిత్రాల్లో పాడి గుర్తింపు పొందారు. వ్యాపారరంగంలో రాణిస్తున్న నా రాయణన్‌మోహన్ సినీ గాయకుడైన తీరును మీడియాకు తెలుపుతూ తాను 1980లో తమిళ నాడు వదిలి అమెరికా వెళ్లానన్నా రు.కాలిఫోర్నియాలో ఒక వ్యాపార సంస్థకు అధినేతగా ఉంటూ 250 మందికి ఉపాధి కల్పిస్తున్నానని తెలిపారు. అరుుతే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆఫీస్ పనులు చూసుకుంటూ సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చి ఏడు గంటల నుంచి 10 గంటల వరకూ సంగీత సాధన చేస్తానన్నారు.ఒ క్కోసారి తెల్లవారు జమున సూ ర్యోదయం వరకూ పాడుకుం టూనే ఉంటానని తెలిపారు. సం గీతం అంటే అంత ఆసక్తి అని చె ప్పారు. అమెరికాలో చాలా సంగీత కచేరీలు నిర్వహించానని, అలా కొన్ని నెలల క్రితం సంగీత దర్శకుడు యూకే.మురళిని కలిసే సందర్భం వచ్చిందన్నారు. అప్పు డు తన కు తమిళనాడు రావాల నే కోరిక కలిగిందన్నారు. ఆ తరువాత చెన్నైలో నిర్వహించిన సంగీత విభావరిలో పలువురు ప్రముఖ గాయనీగాయకులతో కలిసి పాడే అవకాశం కలగడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన మానసిక గురువు,గాయకుడు శంకర్‌మహాదేవన్ అని తెలిపారు. తమిళంలో ఇప్పటి కే నాలుగైదు చిత్రాలలో పాడానని చెప్పారు. తాను ఇటీవల తోండియాన్ చిత్రంలో పాడిన అమ్మా అనే పాట మంచి ప్రాచుర్యం పొందుతుందనే నమ్మకం ఉందని గాయకుడు నారాయణన్‌మోహన్ అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top