కోలీ కాలింగ్‌! | Kiara Advani to Play Female Lead Opposite Vijay | Sakshi
Sakshi News home page

కోలీ కాలింగ్‌!

Aug 10 2019 5:07 AM | Updated on Aug 10 2019 5:07 AM

Kiara Advani to Play Female Lead Opposite Vijay - Sakshi

కియారా అద్వానీ

‘కబీర్‌సింగ్‌’ సక్సెస్‌ జోష్‌లో ఉన్నారు బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ. ఇప్పుడు ఆ జోష్‌ రెట్టింపు అయ్యిందట. విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట టీమ్‌. మరి.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సరసన నటించే చాన్స్‌ వస్తే కియారా కాదనుకోరని ఊహించవచ్చు. మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత రామ్‌చరణ్‌ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. ఇప్పుడు విజయ్‌ ఆఫర్‌కి ఓకే చెబితే తమిళంలో కియారాకి ఇది తొలి సినిమా అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement