‘తెలుగు ప్రజలు నిజంగానే దేవుళ్ళు’ | KGF Hero Yash About Telugu Audience In Success Tour | Sakshi
Sakshi News home page

Dec 27 2018 7:45 PM | Updated on Dec 27 2018 7:46 PM

KGF Hero Yash About Telugu Audience In Success Tour - Sakshi

లాస్ట్‌ పంచ్‌ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా అన్నట్టు.. ఈ ఏడాది చివర్లో వచ్చి అంచనాలను మించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ‘కె.జి.యఫ్‌’. ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ చిత్రం దుమ్ములేపుతోంది. ఏకంగా బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌ ‘జీరో’ సినిమాను బీట్‌ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోందంటే విషయం ఇట్టే అర్థమవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. 

కె.జి.యఫ్‌ సక్సెస్‌ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన హీరో యశ్‌ మాట్లాడుతూ.. ‘కె.జి.యఫ్ గొప్ప విజ‌యం సాధించింది. నా నిర్మాత‌ల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా, బిజినెస్‌ సినిమా అవుతుంది అని ముందుగా నమ్మిన వ్యక్తి విజయ్‌ కిరగందుర్‌. తెలుగులోనూ పెద్ద విజ‌యం సాధించాం. ఇక్క‌డి ప్రజల అభిమానం చూస్తుంటే డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ చెప్పిన `అభిమానులే దేవుళ్ళు` అనే మాట గుర్తుకు వస్తోంది. నా తొలి సినిమాకే ఇంత ఘ‌నంగా వెల్‌కమ్‌ చెప్పిన తెలుగు ప్రజలు నిజ‌మైన‌ దేవుళ్ళు. 10 ఏళ్ల‌ క్రితం ప‌రిశ్ర‌మ‌కు వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి వెల్‌కమ్‌ చెప్పి ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా నన్ను ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. ఈ సినిమాను ముందు నుండి నమ్మి ప్రతీ ఊరిలో ప్రతిఇంటికీ తీసుకెళ్లిన అంద‌రికీ నా ధన్యవాదాలు.ఈ సినిమాను చూసి బూస్టప్‌ ఇచ్చిన ఎస్‌. ఎస్‌. రాజమౌళిగారికి నా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి చాలా లక్కీ. ఒకేసారి అయిదు భాషలలో పరిచయమైంది. తెలుగు హీరోలు చాలా గ్రేట్‌ వాళ్ళ డాన్సులు, ఫైట్స్‌ లకు నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు హీరోలందరి సినిమాలు చూసి నేను తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. వాళ్ళే  నా స్ఫూర్తి’ అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement