కీర్తీ మారిపోయింది | Keerthy Suresh Bollywood Entry With Ajay Devgan | Sakshi
Sakshi News home page

కీర్తీ మారిపోయింది

Apr 16 2019 10:27 AM | Updated on Apr 16 2019 10:27 AM

Keerthy Suresh Bollywood Entry With Ajay Devgan - Sakshi

సినిమా: నటి కీర్తీసురేశ్‌ మారిపోయింది. ఇలా అనగానే ఏదేదో ఊహించుకోకండి. ఈ చిన్నది బాగానే ఉంది. మరేంటంటారా.. కీర్తీ కోలీవుడ్‌లో అవకాశాలను తగ్గించుకుందనే ప్రచారం జరుగుతోంది. చాలా తక్కువ కాలంలోనే మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎడాపెడా చిత్రాలు చేసేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో వరస పెట్టి విజయ్, విక్రమ్, విశాల్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించింది. తెలుగులో మహానటి చిత్రం కోసం శక్తికి మించే శ్రమించిందని చెప్పకతప్పదు. అలా క్షణం తీరిక లేకుండా నటించిన కీర్తీ కాస్త రిలాక్స్‌ అవుతున్నానని బహిరంగంగానే వెల్లడించింది. అయితే ఈ అమ్మడు పెద్దగా విరామం తీసుకున్నట్లు లేదు. మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఎటు తిగిరి కోలీవుడ్‌లోనే ప్రస్తుతానికి ఏ చిత్రంలో నటించడం లేదు.

ఈ చిన్న గ్యాప్‌లోనే అమ్మడికి బాలీవుడ్‌ అవకాశ తలుపు తట్టింది. అజయ్‌దేవ్‌గన్‌తో జత కట్టడానికి రెడీ అయిపోతోంది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. ఈ చిత్ర కోసం కీర్తీసురేశ్‌ ముందుగానే చాలా వర్కౌట్స్‌ చేయాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే బాలీవుడ్‌లో హీరోయిన్లు బొద్దుగా ఉంటే చూడరు. స్లిమ్‌గా మారాల్సిందే. బొద్దుగా ఉన్న నటి సోనాక్షిసిన్హా, ఇలియానా వంటి కొందరు చాలా కష్టపడి బరువు తగ్గారు. ఎక్కడి వరకో ఎందుకు నటి తాప్సీ కూడా పెద్ద బరువు కాకపోయినా బాలీవుడ్‌కు మకాం మార్చాక సన్నబడి అవకాశాలను రాబట్టుకుంటోంది. ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న కీర్తీసురేశ్‌ వర్కౌట్స్‌ బాట పట్టింది. అంతే కాదు చాలా స్లిమ్‌గా తయారైంది. సర్కార్‌ చిత్రంలో నటించిన కీర్తీకి తాజా కీర్తీకీ ఎంతో మార్పు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement