మలుపు తిప్పిన ఆట | Kay Raja Kay movie audio release on 28th september | Sakshi
Sakshi News home page

మలుపు తిప్పిన ఆట

Sep 24 2014 11:02 PM | Updated on Sep 2 2017 1:54 PM

మలుపు తిప్పిన ఆట

మలుపు తిప్పిన ఆట

ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ చిత్రాలకు నా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన శివగణేశ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ సినిమా తీస్తున్నాం. నా సినిమాల విజయంలో ఎవరి క్రెడిట్ వారిదే తప్ప,

‘‘ ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ చిత్రాలకు నా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన శివగణేశ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ సినిమా తీస్తున్నాం. నా సినిమాల విజయంలో ఎవరి క్రెడిట్ వారిదే తప్ప, అందరి క్రెడిట్‌నూ నేను తీసుకునే ప్రయత్నం చేయను’’ అని దర్శక నిర్మాత మారుతి చెప్పారు. రామ్‌ఖన్నా, మానస్, జోష్వ్రి, శ్రావ్య, షామిలి, హరికృష్ణ ముఖ్యతారలుగా శివగణేశ్ దర్శకత్వంలో మారుతి టాకీస్, ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కాయ్ రాజా కాయ్’.
 
 ఈ నెల 28న పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతల్లో ఒకరైన గోపాల్ తెలిపారు. కాయ్ రాజా కాయ్ అంటూ కొందరు స్నేహితులు కలిసి ఆడిన ఆట వారి జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందన్నది ఈ సినిమా ప్రధాన కథాంశమని దర్శకుడు పేర్కొన్నారు. రియలిస్టిక్‌గా ఉండే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని రామ్‌ఖన్నా, మానస్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి., కెమెరా: దేవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీనివాస్ అడ్డాల.
 

Advertisement

పోల్

Advertisement