'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల | Katti actress Sana Khan arrested and released later | Sakshi
Sakshi News home page

'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల

Oct 30 2014 6:12 PM | Updated on Sep 2 2017 3:37 PM

'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల

'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల

తెలుగు చిత్రం 'కత్తి' లో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్ట్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముంబై: తెలుగు చిత్రం 'కత్తి' లో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్ట్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్ లను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి అంధేరి కోర్టుకు తీసుకెళ్లామని, అదే రోజు వారు బెయిల్ పై విడుదలయ్యారని అంబోలి పోలీసుల తెలిపారు. ఈ కేసులో తగిన ఆధారాల కోసం సేకరిస్తున్నామని పోలీసు ఇన్స్ పెక్టర్ వెల్లడించారు. 
 
తనను బెదిరించడమే కాకుండా,  వేధింపులకు కూడా పాల్పడుతున్నారని సనా, ఇస్మాయిల్ లపై ఓ మహిళ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా..  ఓ జిమ్ వద్ద దాడి చేశారని సనా, ఇస్మాయిల్ లపై సోహిల్ ఖాన్ అనే నటుడు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 
 
టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ సరసన కత్తి, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య చిత్రంలో సనా ఖాన్ నటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement