'ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం' : టబు | Katrina Kaif the most hardworking actress : tabu | Sakshi
Sakshi News home page

'ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం' : టబు

Jan 5 2016 3:12 PM | Updated on Apr 4 2019 5:42 PM

'ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం' : టబు - Sakshi

'ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం' : టబు

సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్‌ను మరో హీరోయిన్ పొగడటం చాలా అరుదు. అయితే ఇటీవల కాలంలో ఈ అరుదైన సంఘటన తరుచు జరుగుతోంది.

సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్‌ను మరో హీరోయిన్ పొగడటం చాలా అరుదు. అయితే ఇటీవలి కాలంలో  నటీమణులు ...ఇతర నటులను పొగడటం  తరుచు జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమ తోటి నటీమణులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదే బాటలో సీనియర్ హీరోయిన్ టబు... టాప్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్ను ఆకాశానికి ఎత్తేసింది.

ఫితూర్ సినిమాలో టబు, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్నారు. హీరోయిన్గా కెరీర్ ముగిసిన తరువాత ప్రస్తుతం స్పెషల్ క్యారెక్టర్స్లో మాత్రమే కనిపిస్తోంది టబు. అదే బాటలో ఫితూర్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో అలరించింది. ఈ సందర్భంగా తన కో-స్టార్ కత్రినా కైఫ్పై పొగడ్తల వర్షం కురిపించింది. 'ఇప్పటివరకు నేను కలిసి పనిచేసిన వారిలో కత్రినానే హార్డ్ వర్కింగ్ హీరోయిన్, నటన పట్ల ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం అనిపించింది' అంటూ కత్రినాపై ప్రశంసలు కురిపించింది.

అదే సమయంలో క్యాట్ కూడా టబుపై తన గౌరవాన్ని చూపించింది. ' ఈ సినిమాలో నమ్మలేని విషయం టబు నా తల్లిపాత్రలో కనిపించటం' అంటూ కామెంట్ చేసింది. ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫితూర్, చార్లెస్ డికెన్స్ రచించిన గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నవల ఆధారంగా తెరకెక్కింది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement