'నా ఫ్రెండ్తో మా ఆయన చేసిన రాసలీలలన్నీ చెప్తా' | Katie Price's 'revenge book' due out in four months | Sakshi
Sakshi News home page

'నా ఫ్రెండ్తో మా ఆయన చేసిన రాసలీలలన్నీ చెప్తా'

Jun 8 2016 8:55 AM | Updated on Sep 4 2017 2:00 AM

'నా ఫ్రెండ్తో మా ఆయన చేసిన రాసలీలలన్నీ చెప్తా'

'నా ఫ్రెండ్తో మా ఆయన చేసిన రాసలీలలన్నీ చెప్తా'

ఎంతో ప్రేమను ఒలకబోస్తూనే దారుణంగా తనను మోసం చేసిన భర్త కీరన్ హేలర్పై ప్రముఖ టీవీ స్టార్ కాతీ ప్రైస్ త్వరలో పుస్తకాన్ని విడుదల చేయనుంది

లాస్ ఎంజెల్స్: ఎంతో ప్రేమను ఒలకబోస్తూనే దారుణంగా తనను మోసం చేసిన భర్త కీరన్ హేలర్పై ప్రముఖ టీవీ స్టార్ కాతీ ప్రైస్ త్వరలో పుస్తకాన్ని విడుదల చేయనుంది. తనకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్తో రాసలీలు ఎలా కొనసాగించారో అనే విషయాన్ని ఆమె ఆ పుస్తకంలో బట్టబయలు చేయనుంది.

తన కళ్లు గప్పి భర్త, తన స్నేహితురాలు దారుణంగా మోసం చేశారని వాపోయిన ఆమె ఆ వివరాలన్నింటిని పూసగుచ్చినట్లుగా ఆ పుస్తకంలో చేరుస్తుంది. ఈ పుస్తకానికి గాను ఆమె పెట్టిన పేరు 'రివెంజ్'(ప్రతీకారం). మరో నాలుగు నెలల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేసి తీరుతానని ఆమె ప్రకటించింది. 'నిజం బయటకు వస్తుంది. నాకు జేన్ తెలుసు. ఆమె కిరేన్తో జతకట్టిన విషయం తెలుసు. త్వరలోనే ఈ విషయంపై అన్ని నిజాలు చెప్తాను' అని ఆమె ఓ మేగజిన్తో చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement