పురంబోకు హీరోయిన్‌గా కార్తీక | karthika latest movies signed for ' puramboku ' | Sakshi
Sakshi News home page

పురంబోకు హీరోయిన్‌గా కార్తీక

Dec 16 2013 3:10 AM | Updated on Sep 2 2017 1:39 AM

పురంబోకు హీరోయిన్‌గా కార్తీక

పురంబోకు హీరోయిన్‌గా కార్తీక

నటి కార్తీక పురంబోకు చిత్రానికి హీరోయిన్ అయ్యింది. ఒక నాటి అందాల తార రాధ పెద్ద కూతురు కార్తీక అన్నది తెలిసిందే. మలయాళం, తెలుగు,

నటి కార్తీక పురంబోకు చిత్రానికి హీరోయిన్ అయ్యింది. ఒక నాటి అందాల తార రాధ పెద్ద కూతురు కార్తీక అన్నది తెలిసిందే. మలయాళం, తెలుగు, తమిళం మూడు భాషల్లోనూ పరిచయం అయిన ఈ బ్యూటీకి తమిళ చిత్రం కో సక్సెస్ నందించింది. ఆ తరువాత నటించిన అన్నకొడి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆ చిత్ర పరాజయం కార్తీకకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో డీల్ అనే ఒకే ఒక్క చిత్రం ఉంది.
 
  తాజాగా దర్శకుడు ఎస్.పి.జననాథన్ దృష్టి ఈ భామపై పడింది. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పురంబోకు చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి సిద్ధం అవుతోంది. ఆర్య, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకే హీరోయిన్ ఉం టుందని దర్శకుడు ముం దే చెప్పారు. ఈ పాత్రకు రెండు, మూడు చిత్రాలు చేసిన యువ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఈ పాత్ర ఫైట్స్ కూడా చేయూల్సి ఉంటుం దని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement