నేడు కార్తీ పుట్టిన రోజు | karthi birthday | Sakshi
Sakshi News home page

నేడు కార్తీ పుట్టిన రోజు

May 25 2014 12:58 AM | Updated on Sep 2 2017 7:48 AM

నేడు కార్తీ పుట్టిన రోజు

నేడు కార్తీ పుట్టిన రోజు

పరుత్తివీరన్ అంటూ ఏడేళ్ల క్రితం అవతారమెత్తి పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్న చందాన హీరోగా తొలి చిత్రంతోనే అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కార్తీ.

పరుత్తివీరన్ అంటూ ఏడేళ్ల క్రితం అవతారమెత్తి పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్న చందాన హీరోగా తొలి చిత్రంతోనే అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఆ తరువాత ఆయిరత్తిల్ ఒరువన్, పైయ్యా, నాన్ మహాన్ అల్ల, చిరుత్తైఅంటూ వరుస విజయాలను సాధించిన కార్తీ ఇటీవల చిత్రాల ఎంపికలో కాస్త తడబడినా తాజాగా మోడ్రన్ చిన్నోడంటూ సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. కార్తీ నటిస్తున్న తాజా చిత్రానికి మొదట కాళిలవ్ పేరును పరిశీలించారు. తాజాగా మోడ్రన్ పేరును నిర్ణయించినట్లు సమాచారం. అట్టకత్తిపేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
 
 పుట్టిన రోజు.. అభిమానుల సేవలు
 కార్తీ ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ వేడుక రోజున ఆయన అభిమాన సేన పలు సేవాకార్యక్రమాలకు సిద్ధం అవుతోంది. కార్తీ అఖిల భారత ప్రజా సంక్షేమ సంఘం తరపున పేదలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పలు సహాయ కార్యక్రమాలను, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చెన్నైలోని అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక రాయపురంలోని ఆస్పత్రిలో సహాయ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement