breaking news
karthi birthday
-
మణిరత్నం మల్టీస్టారర్‌లో హీరో కార్తీ!
తమిళ సూపర్ స్టార్ హీరో కార్తీకి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేటితో కార్తీ 43వ(మే 25) వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు సెలబ్రెటీలు, అభిమానులు ప్రత్యేకంగా ట్విటర్లో బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బక్కియాన్ కన్నన్ దర్శకత్వంతో నటిస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో కార్తీ సరసన రష్మిక మండన నటిస్తున్నారు. ఇది రష్మిక తొలి తమిళ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. (స్వర్ణయుగం మొదట్లో..) అంతేగాక ప్రముఖ దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ కార్తీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అదే పేరుతో రూపొందిస్తున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, లాల్, శోభితా ధూలిపాలి నటిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ‘పొన్నియిన్ సెల్వన్’ను మణిరత్నం ఒక దశాబ్థం తర్వాత తెరకెక్కిస్తున్నాడు. ‘రావన్’ తర్వాత ఐశ్వర్య మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. (అందుకే తప్పుకున్నా) -
నేడు కార్తీ పుట్టిన రోజు
పరుత్తివీరన్ అంటూ ఏడేళ్ల క్రితం అవతారమెత్తి పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్న చందాన హీరోగా తొలి చిత్రంతోనే అమోఘ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు కార్తీ. ఆ తరువాత ఆయిరత్తిల్ ఒరువన్, పైయ్యా, నాన్ మహాన్ అల్ల, చిరుత్తైఅంటూ వరుస విజయాలను సాధించిన కార్తీ ఇటీవల చిత్రాల ఎంపికలో కాస్త తడబడినా తాజాగా మోడ్రన్ చిన్నోడంటూ సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. కార్తీ నటిస్తున్న తాజా చిత్రానికి మొదట కాళిలవ్ పేరును పరిశీలించారు. తాజాగా మోడ్రన్ పేరును నిర్ణయించినట్లు సమాచారం. అట్టకత్తిపేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పుట్టిన రోజు.. అభిమానుల సేవలు కార్తీ ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ వేడుక రోజున ఆయన అభిమాన సేన పలు సేవాకార్యక్రమాలకు సిద్ధం అవుతోంది. కార్తీ అఖిల భారత ప్రజా సంక్షేమ సంఘం తరపున పేదలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పలు సహాయ కార్యక్రమాలను, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చెన్నైలోని అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక రాయపురంలోని ఆస్పత్రిలో సహాయ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.