కార్తీ బర్త్‌డే.. సోషల్‌ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

Hero Karthi Birthday: His Upcoming Two Films Releasing Soon - Sakshi

తమిళ సూపర్‌ స్టార్‌ హీరో కార్తీకి సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేటితో కార్తీ 43వ(మే 25) వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు సెలబ్రెటీలు, అభిమానులు ప్రత్యేకంగా ట్విటర్‌లో బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్’‌ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బక్కియాన్‌ కన్నన్‌ దర్శకత్వంతో నటిస్తున్న ‘సుల్తాన్’‌ చిత్రంలో కార్తీ సరసన రష్మిక మండన నటిస్తున్నారు. ఇది రష్మిక తొలి తమిళ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడినట్లు  చిత్ర బృందం తెలిపింది. (స్వర్ణయుగం మొదట్లో..)

అంతేగాక ప్రముఖ దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్‌ మూవీ ‘పొన్నియిన్‌ సెల్వన్’ కార్తీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అదే పేరుతో రూపొందిస్తున్నారు. చోళ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక‌ చిత్రంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, చియాన్‌ విక్రమ్‌, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, లాల్‌, శోభితా ధూలిపాలి నటిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడింది.  కాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను మణిరత్నం ఒక దశాబ్థం తర్వాత తెరకెక్కిస్తున్నాడు. ‘రావన్’‌ తర్వాత ఐశ్వర్య మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. (అందుకే తప్పుకున్నా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top