ఆస్పత్రిలో చేరిన నటి : వెంటిలేటర్‌పై చికిత్స

Kannada Actress Jayanthi Hospitalised And Put On Ventilator - Sakshi

బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి జయంతి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మంగళవారం బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేగాక 24 గంటలపాటు పరిశీలనలో ఉంచనున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా జయంతి గత 35 సంవత్సరాల నుంచి అస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. (టీవీ నటుడు సుశీల్‌ ఆత్మహత్య)

ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నటిని చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని జయంతి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటుందని ఆమె కుమారుడు కృష్ణ కుమార్‌ తెలిపారు. ఇక కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం చేసిన జయంతి అనేక హిందీ, మరాఠీ, తమిళ‌, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. కాగా తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు. (ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌గా మనోజ్‌.. నిజమేనా!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top