కేరాఫ్‌ కాంట్రవర్సీ | Sakshi
Sakshi News home page

కేరాఫ్‌ కాంట్రవర్సీ

Published Tue, Sep 4 2018 2:01 AM

Kangana Ranaut to re-shoot major portions of Manikarnika - Sakshi

కె ఫర్‌ కంగనా. కె ఫర్‌ కాంట్రవర్సీ. కాంట్రవర్సీల్లోకి కంగనా వెళ్తారో లేక కాంట్రవర్సీలు ఆమె చుట్టూ చేరతాయో అర్థం కాదు. ఆఫ్‌ స్క్రీన్‌.. ఆన్‌ స్క్రీన్‌.. ఏదైనా ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ  క్రియేట్‌ చేస్తూనో లేదా వాటిని క్లియర్‌ చేస్తూనో వార్తల్లో ఉంటారామె. తాజాగా ‘మణికర్ణిక’ సినిమా. ఝాన్సీగా స్క్రీన్‌పై కంగనా చేసిన పోరాటాలకంటే బయటే ఎక్కువ పోరాటాలు చేస్తున్నట్టున్నారు. దర్శకుడు క్రిష్‌ ‘యన్టీఆర్‌’ బయోపిక్‌లో బిజీగా ఉండటంతో ప్యాచ్‌వర్క్‌కి ఆల్రెడీ తనే దర్శకత్వ బాధ్యతలను చేపడుతోంది.

సోనూసూద్‌–కంగనా మధ్య డిఫరెన్సెస్‌ రావడంతో ‘మణికర్ణిక’ నుంచి ఆయన తప్పుకున్నారు. దాంతో ఆ పాత్రను మళ్లీ రీషూట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్‌ మరో 15కోట్లు పెరగనుందట. లేడీ ఓరియంటెడ్‌ íసినిమాల్లోనే భారీ ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం రీషూట్‌ వల్ల బడ్జెట్‌ ఇంకా పెరగడం సినిమా రిజల్ట్‌పై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి. ముందు అనుకున్నట్లుగా జనవరిలో ఈ సినిమా రిలీజ్‌ కాదని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement