
కమల్‌హాసన్
కమల్‌హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా కమల్‌హాసన్ దర్శకత్వంలోనే ‘విశ్వరూపం 2’ రూపొందింది. ఆస్కార్ ఫిలింస్ (ప్రై) లిమిటెడ్ వి.రవిచంద్రన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారనే వార్తలు వచ్చాయి. ‘‘తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు రవిచంద్రన్.